Taraka Ratna Marriage Pics : తారకరత్న పెళ్ళి ఎంత సింపుల్గా జరిగిందో - అందుకు ఈ ఫొటోలే సాక్ష్యం
ఎన్టీఆర్ మనవడు, సినిమాటోగ్రాఫర్ మోహనకృష్ణ కుమారుడు తారకరత్న ఓ సామాన్యుడిలా, అంత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. అందుకు, ఈ ఫొటోలే సాక్ష్యం. ఒక్కసారి ఆ ఫోటోలను చూడండి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కుమార్తె అలేఖ్యా రెడ్డిని తారక రత్న వివాహం చేసుకున్నారు.
తారకరత్నకు ఇది మొదటి వివాహం కాగా, అలేఖ్యా రెడ్డికి రెండో వివాహం. ఈ పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అందుకని, హైదరాబాద్ సంఘీ టెంపుల్ గా స్నేహితుల సమక్షంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు.
తారకరత్న పెళ్లికి నందమూరి కుటుంబ సభ్యులు గానీ, ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలు గానీ ఎవరూ హాజరు కాలేదు.
అలేఖ్యా రెడ్డికి వరుసకు సోదరుడు అయ్యే అవినాష్ రెడ్డి తమకు ఎంతో అండగా నిలిచారని ఒకానొక సమయంలో తారకరత్న పేర్కొన్నారు.
అలేఖ్యా రెడ్డి సోదరి చెన్నైలోని ఓ పాఠశాలలో చదువుకున్నారు. ఆమెకు తారక రత్న సీనియర్. అయితే, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరు కలుసుకున్నారు. 'నందీశ్వరుడు' సినిమాకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. తొలుత తారక రత్న లవ్ ప్రపోజ్ చేశారు.
తారకరత్న, అలేఖ్యా రెడ్డి పెళ్లి ఫోటోలు