Nag Ashwin News: స్వగ్రామంలో నాగ్ అశ్విన్ సందడి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కల్కీ డైరెక్టర్

నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీద ప్రశంసల జల్లులు కురిపించారు. స్వగ్రామంలో పిల్లల కోసం స్కూల్ బిల్డింగ్ కట్టడంలో ఆర్థిక సాయం చేశారని గుర్తుచేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
కాంగ్రెస్ నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తాడూరు మండలంలోని ఐతోలు గ్రామంలో ఆవిష్కరించారు సినీ దర్శకుడు నాగ్ అశ్విన్.

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, సినీ రంగంలో మరెన్నో విజయాలు అందుకోవాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆకాంక్షించారు.
నాగ్ అశ్విన్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండంలోని ఐతోలు గ్రామం అని తెలిసిందే. ఆయన తల్లిదండ్రులు, పూర్వీకులు హైదరాబాద్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. కానీ నాగ్ అశ్విన్ స్వగ్రామానికి అందుబాటులో ఉంటారు.
ఐతోలు గ్రామంలో చిన్నారులకు మ్యూజిక్, ఇతర పరికరాలను నాగ్ అశ్విన్ సమకూర్చారు. తాజాగా ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొని స్వగ్రామంలో సందడి చేశారు.
నేను మీకు తెలుసా?, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్ పనిచేశారు. ఆ సినిమాల్లో కొన్ని క్షణాలు తెరమీద సైతం కనిపించారు.
గ్రామానికి వచ్చిన నాగ్ అశ్విన్‌కు, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ఎవడే సుబ్రహ్మణ్యంతో డైరెక్టర్‌గా మారిన నాగ్ అశ్విన్ మహానటితో భారీ సక్సెస్ అందుకున్నారు. ఆపై పిట్ట కథలు తీసిన ఆయన ప్రభాస్‌తో కల్కి 2898 ఏ.డీ తెరకెక్కించారు. ఈ మూవీ రెండో పార్ట్ పనులు జరుగుతున్నాయి.