HBD Mrunal Thaku: నటనకు పనికి రాదంటూ విమర్శలు - కట్ చేస్తే పాన్ ఇండియా హీరోయిన్.. మృణాల్ గురించి ఈ విషయాలు తెలుసా?
Mrunal Thakur Birthday Special: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'సీతారామం' సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమాలో మృణాల్ కట్టుబోట్టు, అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీతగా మృణాల్ కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది. అలా తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ మరాఠి భామ పుట్టిన రోజు నేడు. ఆగస్ట్ 1, 1992 ముంబై మహారాష్ట్రలో జన్మించింది మృణాల్. మొదట టీవీ సీరియల్స్‌తో కెరీర్ స్టార్ చేసింది.
'ముజ్సే కుచ్ కెహ్తీ','యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్‌తో నటనను ప్రారంభించింది. మృణాల్ నటించిన కుంకుమ్ భాగ్య సీరియల్ మంచి గుర్తింపు పొందింది. ఇందులో హీరోయిన్ చెల్లెలిగా తన అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. కుంకుమ్ భాగ్య దక్షిణాది భాషల్లోనూ ఈ సీరియల్ డబ్ అయ్యింది.
దాంతో సౌత్‌లో బుల్లితెర ఆడియన్స్‌కి పరిచయం అయ్యింది. టీవీ నటి కెరీర్ స్టార్ట్ చేసిన మృణాల్.. సినిమాలపై ఆసక్తి చూపించింది. ఆ దిశ ప్రయత్నాలు చేసి సినిమాల్లో సహానటి పాత్రలు పోషించింది. ఆ తరువాత 2018లో లవ్ సోనియా సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది ఈ ముద్దు గుమ్మ.
ఇందులో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా కమర్షియల్ మంచి విజయం సాధించలేకపోయింది. తొలి సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అంతేకాదు ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న మృణాల్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొంది.
అసలు నటనకు పనికి రావు అని, హీరోయన్ ముఖమేనా? అంటూ ట్రోల్స్ ఎదుర్కొంది. అయినా వెనకడుగు వేయకుండ హీరోయిన్ చాన్సస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో మృణాల్ మన తెలుగు డైరెక్టర్ హనురాఘవపుడి కంట పడింది.
దీంతో ఆమె సీతారామం సినిమాలో హీరోయిన్గా ఫైనల్ చేశాడు. ఈ సినిమా సీత పాత్రకు మృణాల్ పర్ఫెక్ట్గా ఆప్ట్ కావడంతో ఆడియన్స్ నుంచి అప్పల్స్ అందుకుంది. 2022లో విడుదలైన ఈ సినిమా మృణాల్ కెరీర్‌ను మార్చేసింది. రాత్రిరాత్రే స్టార్ డమ్ కొట్టేసింది.
ఇక సీతారామం సినిమాతో వచ్చిన క్రేజ్ ఈ భామ తెలుగు, హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. తెలుగులో ఆమె నటించి హాయ్ నాన్న సినిమా మంచి విజయం సాధించింది. ఇక విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ దెబ్బ కొట్టింది.
కానీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమె ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కానీ స్క్రిప్ట్ ఎన్నికలో ఈ భామ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే సీతారామం సినిమాకు కూడా ఉత్తమ నటిగా మృణాల్ పల్మ్ఫేర్ అవార్డుకు గెలుచుకుంది. అలాగే సీతారామం, హాయ్ నాన్న సినిమాకు గాను ఉత్తమ నటిగా సైమా ఆవార్డు కొట్టేసింది.