అందాల మీరా, మీరు అమృతం తాగారా? ఈ ఫొటోలు చూస్తే మీరూ అదే అంటారు!
మీరా జాస్మిన్.. ఒకప్పుడు బొద్దుగా, హోమ్లీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రూటు మార్చింది. గ్లామర్ పాత్రలకైనా సై అంటూ ఇప్పటికే సిగ్నల్ ఇచ్చింది. సోషల్ మీడియాలోకి అడుగు పెడుతూనే.. తన అందాల ప్రదర్శనతో ఔరా అనిపించింది. - Images Credit: Meera Jasmine/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మీరా.. ఇటీవలే తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ‘విమానం’ సినిమాలో ఎయిర్ హోస్టెస్‌గా తళుక్కున మెరిసింది.
ప్రస్తుతం మీరా మలయాళ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. అందాల ప్రదర్శనకు సిద్ధమైనా.. అక్కడా కూడా హోమ్లీ పాత్రలకే అవకాశాలు దొరుకుతున్నాయి.
అయితేనేం.. సోషల్ మీడియాలో మాత్రం మీరా ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూసి.. ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
అమృతం గానీ తాగారా మీరా? 41 ఏళ్ల వయస్సులో కూడా అంత అందంగా మెరిసిపోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి, ఈ ఫొటోలన్నీ చూశాక మీకూ అదే సందేహం వచ్చి ఉంటుంది కదూ.