ముద్దుకే కాదు.. దేనికైనా సిద్ధమే అంటోన్న మలయాళీ ముద్దుగుమ్మ.. ఈమె ఎవరో తెలుసా?
మాళవిక మేనన్.. మలయాళీ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో సంప్రదాయకంగా.. పక్కింటి అమ్మాయిలా ఉండే మాళవికకు ఎలాగైనా సరే పెద్ద హీరోయిన్ కావాలనేది కల. అయితే, మలయాళ సినిమాల్లో ఆ అవకాశం వచ్చినా.. తన ‘టాలెంట్’ను చూపించే ఛాన్సులైతే రావడంలేదని వాపోతుంది. టాలెంట్ అంటే? అబ్బా.. చిలిపి మీకేమీ తెలియనట్టు. - Malavika Menon/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాళవిక మేనన్.. దాదాపు 8 ఏళ్ల కిందటే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదేంటీ.. ఎప్పుడూ మన తెలుగు సినిమాల్లో చూసినట్లు లేదే అనేగా మీ సందేహం. అది నిజమే.. ఆమె తెలుగు సినిమాల్లో నటించిన మాట వాస్తవమే. కానీ, ఆ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. - Malavika Menon/Instagram
అయ్యో పాపం, ఇంతకీ ఆ సినిమాలేంటీ అనేగా మీ తర్వాతి ప్రశ్న?.. 2016లో ఈమె ‘లవ్ కె రన్’, 2018లో ‘అమ్మాయిలు అంతే అదోటైపు’ అనే మూవీలో నటించింది.
పాపం, ఆమె బ్యాడ్ లక్కో ఏమిటో.. ఆ రెండూ విడుదల కాలేదు. కనీసం యూట్యూబ్, ఓటీటీల్లో కూడా ఆ మూవీస్ లేవు. అయితే, ఆ సినిమాల ప్రోమోలు, ట్రైలర్లను యూట్యూ్బ్లో చూడవచ్చు. - Malavika Menon/Instagram
తాజాగా ఆమె మలయాళంలో నటించిన ‘వన్స్ అపన్ ఏ టైమ్ ఇన్ కొచి’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఆనందానికి అవధుల్లేవు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు, తమిళ సినిమాలు గురించి కామెంట్ చేసింది. - Malavika Menon/Instagram
మలయాళంలో అభినయానికి అవకాశం ఉన్న పాత్రలు లభిస్తుంటాయని తెలిపింది. తెలుగు, తమిళ సినిమాల్లో గ్లామర్‌కు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. - Malavika Menon/Instagram
అలాగే, కథ డిమాండ్ చేస్తే తాను ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చేయడానికి కూడా సిద్ధమేనంటూ.. టాలీవుడ్, కోలీవుడ్ దర్శక నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. - Malavika Menon/Instagram
మరి, ఈ అమ్మడి స్టేట్మెంట్ మనోళ్లు విన్నారో లేదో. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ 2011లో ‘నిద్ర’ అనే మలయాళం సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు మలయాళం, తెలుగు, తమిళంతో కలిపి 42 సినిమాల్లో నటించింది. - Malavika Menon/Instagram