In Pics: రామోజీ సంస్మరణ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ - ఫోటోలు
విజయవాడలోని కానూరులో రామోజీ రావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
సినీ రంగం నుంచి రాఘవేంద్రరావు, డి.సురేష్ బాబు, అశ్వనీదత్, మురళీ మోహన్, రాజమౌళి, కీరవాణి, శ్యాం ప్రసాద్ రెడ్డి, బోయపాటి శ్రీను, జయసుధ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ మాదిరిగా అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అమరావతిలో ఒక రోడ్డుకు రామోజీరావు మార్గ్ గా పేరు పెడతామని.. విశాఖపట్నంలో చిత్రనగరి ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత అని చంద్రబాబు అన్నారు.
రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదని.. 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని పవన్ కల్యాణ్ తెలిపారు.
2019లో తనను ఒకసారి లంచ్ మీటింగ్ కు రామోజీరావు ఆహ్వానించారని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు.
రామోజీ రావు లాంటి మహోన్నత వ్యక్తి విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారని రామోజీరావు తనయుడు కిరణ్ తెలిపారు.
నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరును రామోజీరావే సూచించారని గుర్తు చేసుకున్నారు
అందుకే అమరావతి నిర్మాణం కోసం తాము రూ.10 కోట్లు విరాళం అందిస్తున్నామని సంస్మరణ సభలో ప్రకటించారు.
అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా వర్ధిల్లాలని రామోజీరావు ఆకాంక్షించేవారని కిరణ్ గుర్తు చేసుకున్నారు.
ఈ సంస్మరణ సభలో కీరవాణి, రాజమౌళి, శ్యాం ప్రసాద్ రెడ్డి, అశ్వనీదత్ తదితరులు కూడా మాట్లాడారు.
రామోజీరావుతో తమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు.