Kriti Sanon: కృతి సనన్ స్టైలిష్ ఫోజులు - డెనిమ్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ
Kriti Sanon Photos: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతను ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమతో అయినా ప్రస్తుతం బాలీవుడ్లో సెటిలైపోయింది. మహేష్ బాబు వన్ నెనొక్కడినే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.
ఈ చిత్రంలో కృతి లుక్‌కి కుర్రకారు ఫిదా అయ్యింది. హాలీవుడ్ రేంజ్ ఫిగర్ అంటూ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నాగచైతన్య సరసన దోచేయ్‌లో నటించింది.
రెండు సినిమాలు ఆశించిన రేంజ్ హిట్ లేకపోవడంతో కృతిని మన తెలుగు డైరెక్టర్ పెద్ద పట్టించుకోలేదు. దీంతో ఈ భామ బాలీవుడ్ చెక్కేసింది.
అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. గతేడాది ఆదిపురుష్‌తో తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది.
ఇందులో సీతగా టాలీవుడ్ ఆడియన్స్ మనసులు దోచేసింది. ఇక రీసెంట్గా బాలీవుడ్ 'క్రూ' చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కృతి చేతిలో పలు హిందీ సినిమాలు ఉన్నాయి.
మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కృతి తన లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసింది.
ఇందులో డెమిమ్ బ్రాండ్ జీన్స్, జాకెట్ ధరించిన స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.