keerthy Suresh: ముంబైకి షిష్ట్ అవుతున్న కీర్తి సురేష్? - ఎయిర్‌పోర్టులో 'మహానటి' సందడి
Keerthy suresh Spotted at Mumbai Airport: 'మహానటి' కీర్తి సురేష్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరోయిన్ గ్లామరస్ పాత్రైనా, లేడీ ఒరియంటెడ్లో కథలో డి-గ్లామర్ పాత్రలైనా.. హీరోలకు చెల్లి రోల్స్ అయినా సై అంటుంది.
ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి పాత్రకైనా ఓకే అంటుంది. మొన్నటి వరకు సౌత్‌లో బిజీగా అయిపోయిన ఈ భామ ఇప్పుడు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది.
బేబీ జాన్ సినిమాలో బాలీవుడ్లో అడుగుపెడుతుంది. ఈ మూవీ సెట్లో ఉండగానే హిందీలో మరో బంపర్ ఆపర్ కొట్టేసింది.
ఏకంగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే చాన్స్ కొట్టేసిందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్ కనుగ ఓకే అయితే కీర్తి ఇక ముంబైకి షిఫ్ట్ అయిపోతుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడది నిజమేనా అనిపిస్తుంది. తాజాగా కీర్తి ముంబై ఎయిర్‌పోర్టులో సందడి చేసింది. కూలింగ్ గ్లాసెస్ ధరించి కర్లీ హెయిర్‌తో గ్లామరస్ లుక్‌తో దర్శనం ఇచ్చింది ఈ బ్యూటీ.
ఎయిర్‌పోర్టు బయట ఈ భామ మీడియా కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. ఇది చూసి ఆమె ఫ్యాన్స్ కీర్తి ఇక ముంబైకి షిఫ్ట్ అవుతుందా? ఇక ముంబైలోనే మాకాం పెట్టేస్తుందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా అక్షయ్‌కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట.
అయితే ఈ మూవీలో కథానాయిక పాత్ర కోసం అలియాభట్, కియారా అద్వానీ పేర్లను పరిశీలించిన మూవీ టీం చివరకు కీర్తి సురేష్‌ను ఫిక్స్ చేసిందని టాక్.