Keerthy Suresh: క్రిస్టియన్ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్... వైట్ గౌనులో ఏంజెల్లా మహానటి

Keerthy Suresh Christian Wedding Photos: మహానటి కీర్తి సురేష్ పెళ్లి రెండు సంప్రదాయాలలో జరిగింది. తొలుత హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న ఆవిడ... ఆ తరువాత తన భర్త ఆంటోనీ మతమైన క్రిస్టియన్ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
క్రిస్టియన్ వెడ్డింగ్ అంటే పెళ్లికూతురు ఏంజెల్, భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్య అన్నట్టు తెల్లగౌనులో రెడీ అవుతారు. కీర్తి సురేష్ కూడా అలాగే రెడీ అయ్యారు. తన క్రిస్టియన్ వెడ్డింగ్ ఫోటోలను తాజాగా ఆవిడ షేర్ చేశారు.

క్రిస్టియన్ ట్రెడిషనల్ వెడ్డింగ్ జరిగిన సమయంలో భర్త ఆంటోనీతో కీర్తి సురేష్ దిగిన ఫోటో. జీవితాంతం కలిసి ఉంటానని ఆవిడ తన ప్రామిస్ చదువుతున్నప్పుడు తీశారు.
గత ఏడాది 2024లో డిసెంబర్ 12న కీర్తి సురేష్ ఆంటోనీ వెడ్డింగ్ జరిగింది. గోవాలో సినిమా ప్రముఖులు కుటుంబ సభ్యులు కొంతమంది స్నేహితుల సమక్షంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయిన వారం రోజులకే హిందీ సినిమా బేబీ జాన్ విడుదల ఉండడంతో ముంబై వెళ్లి ఆ సినిమా ప్రమోషన్స్ చేసి వచ్చారు కీర్తి సురేష్. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఆశించిన విజయం సాధించలేదు కానీ ఆవిడ నటనకు పేరు వచ్చింది.
షూటింగ్స్, రిలీజ్ వంటి హడావిడి ముగియడంతో కీర్తి సురేష్ తనకు వీలు చిక్కిన ప్రతిసారి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.