Exit Poll 2024
(Source: Poll of Polls)
Kavya Kalyanram: కావ్య కళ్యాణ్‌రామ్.. ఈ భంగిమల్లో భలే బాగుంది కదూ!
కావ్య కళ్యాణ్‌రామ్.. ఈ పేరు వినగామనే మనకు వెంటనే గుర్తుకొచ్చేది.. ‘బలగం’ మూవీనే. ఇంతకు ముందు ఆమె ‘మసూద’ మూవీలో మెరిసినా.. ‘బలగం’ మూవీతోనే ఎక్కువ గుర్తింపు పొందింది. చిన్న చిన్న సినిమాలతో.. చక్కని పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేందుకు ఈమె చాలా ప్రయత్నాలు చేస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకావ్య.. ‘గంగోత్రి’ మూవీతో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె చిరంజీవి నటించిన ‘ఠాగూర్’, ప్రభాస్ మూవీ ‘అడవి రాముడు’ వంటి సినిమాల్లో నటించింది.
తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశాలు వచ్చినా.. చదువులపైనే ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. 2008లో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాల్లో నటించడం మానేసింది.
చదువులు పూర్తిచేసుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే.. మళ్లీ వెండితెరపై తన లక్‌ను మరోసారి పరీక్షించుకోవాలనే ప్రయత్నంతో వివిధ సినిమాల ఆడిషన్స్‌లో పాల్గోవడం మొదలుపెట్టింది.
అలా ఆమె ‘మసూద’ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. సూపర్ హిట్ మూవీతో రీ-ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘బలగం’ మూవీ కూడా అంతకు మించి హిట్ కొట్టింది. కావ్య.. ఇక హ్యాట్రిక్ కొట్టడమే తరువాయి అనుకుంటున్న సమయంలో పెద్ద బ్రేక్ పడింది.
సింహా కోడూరి హీరోగా నటించిన ‘ఉస్తాద్’ మూవీ ఫ్లాప్ కావడంతో కావ్య హిట్లకు కూడా బ్రేక్ పడినట్లయ్యింది. అయితేనేం.. కావ్య సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లోనే ఉంది.