Kangana Ranaut at Tirumala today: తిరుమలలో కంగనా రనౌత్, విష్ణు మంచుకు ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
హిందీ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విష్ణు మంచుకు థాంక్స్ చెప్పారు. ఎందుకంటే... దర్శనం విషయంలో హెల్ప్ చేసినందుకు! విష్ణుతో పాటు ఏవీ ధర్మారెడ్డికి కూడా కంగన థాంక్స్ చెప్పారు. (Image courtesy - @Kangana Ranaut/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. (Image courtesy - @Kangana Ranaut/Instagram)
కంగనా రనౌత్ వెంట 'ధాకడ్' చిత్ర నిర్మాత దీపిక్, ఆయన సతీమణి కృష్ణ ఉన్నారు. (Image courtesy - @Kangana Ranaut/Instagram)
మే 20న 'ధాకడ్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఏడు కొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కంగనా రనౌత్ అండ్ టీమ్, సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారట. (Image courtesy - @Kangana Ranaut/Instagram)
తిరుమలలో కంగనా రనౌత్ (Image courtesy - @Kangana Ranaut/Instagram)