Kalki 2898 AD Collection Worldwide Day 1: కల్కి 2898 ఏడీ ఫస్ట్ డే కలెక్షన్స్ అఫీషియల్ - డబుల్ సెంచరీ జస్ట్ మిస్!
అక్షరాలా రూ. 191.50 కోట్లు... 'కల్కి 2898 ఏడీ' సినిమా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్ట్ చేసిన గ్రాస్. ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ విడుదల చేసిన పోస్టర్ అది. ప్రభాస్ స్టార్ డమ్ సత్తా మరోసారి బాక్సాఫీస్ బరిలో కనిపించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'కల్కి 2898 ఏడీ' సినిమాకు ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అది బాక్సాఫీస్ బరిలో భారీగా కనిపించింది. మొదటి రోజు డబుల్ సెంచరీకి జస్ట్ 8.5 కోట్ల రూపాయల దూరంలో ఆగింది.
'కల్కి 2898 ఏడీ' సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశారు. కాశీలో భైరవుడిగా ఒక రోల్ చేశారు. మరొక రోల్ కర్ణ. మహాభారతంలో యుద్ధ సన్నివేశంలో కనిపిస్తారు. అది కాసేపే అయినప్పటికీ... విపరీతమైన స్పందన వచ్చింది.
'కల్కి 2898 ఏడీ' సినిమాలో భగవంతుడికి జన్మ ఇచ్చే మహిళగా దీపికా పదుకోన్ కనిపించారు. ప్రభాస్, దీపిక మధ్య సన్నివేశాలు తక్కువ. కానీ, అవి సినిమాకు చాలా కీలకం.
దర్శకుడు నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సైన్స్ ఫిక్షన్, ఇండియన్ మైథాలజీ అంశాలు మేళవించి ఇంత అద్భుతంగా తెరకెక్కించవచ్చా? అని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
'కల్కి 2898 ఏడీ'లో ఈ సూపర్ కార్ ప్రధాన పాత్ర పోషించింది. బుజ్జి చేసిన ఫీట్స్ ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి. ఆ బుజ్జికి కీర్తీ సురేష్ ఇచ్చిన వాయిస్ కూడా ఎంతో బావుంది.