Kajal Aggarwal - Holination 2025: హైదరాబాద్లో కాజల్ రంగోలి, హోలీ... 'రౌనాక్స్ హై'లో హోలినేషన్కు చందమామ, ఎప్పుడో తెలుసా?
రంగుల కేళి... హోలీకి అందరూ రెడీ అవుతున్నారు. ఈ శుక్రవారం (మార్చి 14న) హోలీ ఫెస్టివల్. తెలుగుతెర చందమామ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది హోలీని హైదరాబాద్ సిటీలో సెలబ్రేట్ చేసుకోనున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ సిటీలోని జూబ్లీ హిల్స్ ఏరియాలోని మాదాపూర్ రౌనాక్స్ హై మ్యాన్-మేడ్ హిల్స్ నందు ఈ నెల 14న హోలీ సెలబ్రేషన్స్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్ అండ్ టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హాజరు కానున్న ఈ సెలబ్రేషన్స్ వివరాలు, పోస్టర్ లాంచ్ ప్రోగ్రాం టాబెర్నా క్లబ్ అండ్ కిచెన్లో లో జరిగింది.
హైదరాబాద్ మోడల్స్ ఎండీ వంశీ పల్లె, నటి నిషా సింగ్ రాజ్ పుత్, ఆల్వేస్ ఈవెంట్స్ సుమంత్ నాని తదితరులు 'హోలినేషన్ 2025' పోస్టర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ సిటీలో ఇప్పటి వరకు లేనటువంటి విధంగా సుమారు ఏడు వేల నుంచి తొమ్మిది వేల మంది ఈ వేడుకకు హాజరు కానున్నారని వంశీ పల్లె తెలిపారు. దీనికి కాజల్ అగర్వాల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని తెలిపారు.
'హోలినేషన్ 2025'లో రెయిన్ డ్యాన్స్ సెటప్, పాపులర్ డీజేలు, మ్యూజిక్, వాటర్ గన్స్, రంగు రంగుల స్ప్లాష్లు, టేస్టీ ఫుడ్ వంటి ఏర్పాట్లు చేసినట్లు వంశీ పల్లే వివరించారు. పర్యావరణానికి అనుకూలంగా సహజ రంగులతో ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
సినిమాలకు వస్తే... విష్ణు మంచు హీరోగా రూపొందిన 'కన్నప్ప' సినిమాలో ఆవిడ పార్వతి రోల్ చేశారు. మరికొన్ని సినిమాలు ఆవిడ చేతిలో ఉన్నాయి.
అబ్బాయి పుట్టిన కొన్ని రోజులకు కాజల్ అగర్వాల్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఇక నుంచి తెలుగు సినిమాలపై కాన్సంట్రేషన్ చేయడం కోసం టాలీవుడ్ రాజధానికి మకాం మార్చారు.