NTR-Prashanth Neel: గుప్చుప్గా NTR 31 మూవీ ప్రారంభోత్సవం - క్లాప్ కొట్టిన తారక్, ఫోటోలు చూశారా?
NTR 31 Pooja Ceremony Photos: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNTR31 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రకటించారు. సుమారు రెండేళ్ల తర్వాత ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ఇవాళ ఆగష్టు 9న మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు.
గప్‌చుప్‌గా జరిపించిన ఈ ఈవెంట్లో కేవలం సినిమా సంబంధంచిన నిర్మాతలు, ప్రొడక్షన్ డిపార్ట్‌మెట్ మాత్రమే పాల్గొంది. ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఇద్దరు కుమారులతో ఈ వెంట్‌కు హాజరయ్యాడు.
ప్రశాంత్ భార్యతో కలిసి వచ్చాడు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహుర్తపు సన్నివేశానికి స్వయంగా ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా.. ఆయన భార్య ప్రణతి, ప్రశాత్ భార్యల కెమెరా స్వీచ్చాన్ ఆన్ చేశారు.
ఎన్టీఆర్ 31 పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పూజా కార్యక్రమంలో నందమూరి మరో హీరో, నిర్మాత కళ్యాణ్‌రామ్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు కూడా పాల్గొన్నారు.
మూవీ సభ్యులు తప్ప బయట వారెవరికి ఈ NTR31 ప్రారంభోత్సవానికి ఆహ్వానం ఇవ్వనట్టు సమాచారం. ఇక ఈ సినిమాను 2026లో జనవరి 6న విడుదల చేయబోతున్నట్టు కూడా మూవీ టీం ప్రకటించింది.