COURT Movie Launch: సరిపోదా శనివారం సక్సెస్ జోష్లో నిర్మాతగా కొత్త సినిమా 'కోర్ట్'కు క్లాప్ కొట్టిన నాని
ఇప్పుడు 'సరిపోదా శనివారం' సినిమా సక్సెస్ జోష్లో ఉన్నారు నేచురల్ స్టార్ నాని. ఆ ఆనందంలో నిర్మాతగా కొత్త సినిమాకు క్లాప్ కొట్టారు. నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా పతాకంపై కమర్షియల్ సక్సెస్, క్రిటిక్స్ అప్లాజ్ పొందిన ఫిలిమ్స్ వచ్చాయి. కంటెంట్ డ్రివెన్ సినిమాలు తీస్తుందని వాల్ పోస్టర్ సంస్థ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సంస్థలో ప్రియదర్శి హీరోగా 'కోర్ట్' సినిమా రూపొందుతోంది. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఆ సినిమా స్టార్ట్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రియదర్శి ప్రధాన పాత్రలో వాల్ పోస్టర్ సంస్థ సినిమా నిర్మిస్తున్న సినిమా 'కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' టైటిల్ ఖరారు చేశారు. దీంతో రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ఈ రోజు (ఆగస్టు 30, 2024)న పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభమైంది. ప్రియదర్శి మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ ఇవ్వగా... చిత్ర నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి నిర్మాత 'జెమినీ' కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.
'కోర్టు' సినిమాలో సీనియర్ కథానాయకులు శివాజీ, సాయి కుమార్, ఇంకా రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీ దేవి కీలక తారాగణం.
పూజా కార్యక్రమాలతో 'కోర్ట్' సినిమాను ప్రారంభించడంతో పాటు టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అది చూస్తే... బోనులో న్యాయదేవత ఉంది. ఆమె చేతిలో త్రాసు బంగారంతో కనబడుతోంది. ఆ త్రాసు చుట్టూ శాంతి చిహ్నాలైన పావురాలు ఎగరడం గట్రా సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. ఓ యువకుడిని అన్యాయంగా కేసులో ఇరికించిన వాస్తవ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కుతోందని టాక్. ఇందులో ప్రియదర్శి లాయర్ రోల్ చేస్తున్నారు.
'కోర్టు' చిత్రానికి కళా దర్శకత్వం: విట్టల్ కోసనం, కథనం: రామ్ జగదీష్ - కార్తికేయ శ్రీనివాస్ - వంశీధర్ సిరిగిరి, ఛాయాగ్రహణం: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: విజయ్ బుల్గానిన్, సమర్పణ: నాని, నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని, నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా, కథ - దర్శకత్వం: రామ్ జగదీష్.