Raksha Gowda on Guppedantha Manasu Sequel: బైబై అంటూనే 'గుప్పెడంత మనసు సీక్వెల్' అప్ డేట్ ఇచ్చేసిన వసుధార!
గుప్పెడంత మనసు సీరియల్ కి ఎండ్ కార్డ్ పడడంతో రిషిధార ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. మిస్ యూ రిషి సర్, మిస్ యూ వసుధార అని సోషల్ మీడియా వేదికగా వరుస మెసేజెస్ పెడుతున్నారు.
సీరియల్ సక్సెస్ కి కేవలం స్టోరీ మాత్రమే కాదు.. రిషిగా ముఖేష్ గౌడ, వసుధారగా రక్షాగౌడ నటనకు ఫిదాకానివారు లేరు. టీచర్ - స్టూడెంట్ అల్లరి గొడవ ప్రేమగా మారడం..ఆ తర్వాత పెళ్లి.. వ్యక్తిగత జీవితంలో వరుస ఇబ్బందులు..మళ్లీ ఎట్టకేలకు ఒక్కటయ్యారు అనేసరికి ముగింపు...
రిషిధార ఎప్పుడు కలుస్తారా అని ఎదురుచూశాం..తీరా వాళ్లు హ్యాపీగా ఉన్నారనేసరికి ఎండ్ కార్డ్ వేయడం ఏంటని అభిమానులు తెగ బాధపడిపోతున్నారు...అయితే బైబై చెబుతూనే వసుధార గుడ్ న్యూస్ చెప్పింది
తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల లవ్ ని నేను అనుభూతిచెందాను..థ్యాంక్యూ సోమచ్..నిజానికి సీరియల్ ముగిసిపోవడం బాధగానే ఉంది కానీ.. ఏదో ఒకరోజు ఎండ్ అవ్వాల్సిందే కదా అని చెప్పుకొచ్చింది వసుధారగా నటించిన రక్షాగౌడ. గుప్పెడంత మనసు సీరియల్ సీక్వెల్ ఉంటే మళ్లీ మీ ముందుకు వస్తానని క్లారిటీ ఇచ్చేసింది
స్మాల్ స్క్రీన్ బాహుబలి గా పేరుతెచ్చుకున్న కార్తీకదీపం సీరియల్ కి సీక్వెల్ నడుస్తోంది కాబట్టి గుప్పెడంతమనసు కూడా సీక్వెల్ వస్తుందని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. మరి హీరోగా బిజీ అవుతోన్న ముఖేష్ గౌడ..సీక్వెల్ లో ఉంటాడో లేదో..
గుప్పెడంతమనసు సీరియల్ సీక్వెల్ (Image Credit: Raksha Gowda/Instagram)