Naga Chaitanya-Sobhita Dhulipala: నాగ చైతన్య - శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఫోటోలు - కొత్త జంటకు దిష్టి తీయండమ్మా!
Naga Chaitanya Engagement Photos: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య జీవితంలో ఆగస్టు 8న చాలా ముఖ్యమైన రోజు. శోభితా ధూళిపాళతో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ పెద్దలు, సభ్యుల అనుమతితో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ట్వీట్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాబోయే కొత్త జంట చైతన్య, శోభితకు అభిమానులు, ప్రేక్షకులతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. దిష్టి తీయమని కొందరు సలహా ఇస్తున్నారు.
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ప్రేమలో ఉన్నారని కొన్నాళ్ల క్రితమే బయటకు వచ్చింది. అందుకు కారణం ఈ ఫోటోనే. లండన్ రెస్టారెంట్ తమ సోషల్ మీడియాలో చైతన్య వచ్చారని పేర్కొంది. అందులో శోభిత కనిపించడంతో జనాలు సందేహం కలిగింది.
శోభితా ధూళిపాళ, నాగ చైతన్య మీద ప్రేక్షకుల్లో కలిగిన సందేహం నిజమని ఆ తర్వాత కొన్నాళ్ళకు స్పష్టం అయ్యింది. వాళ్లిద్దరి లండన్ టూర్ ఫోటోలు నెట్టింట షికార్లు కొట్టాయి.
శోభితా ధూళిపాళ తెలుగమ్మాయి. ఆమె స్వస్థలం తెనాలి. తండ్రి నేవి ఉద్యోగి కావడంతో విశాఖ, ముంబై ప్రాంతాల్లో పెరిగింది. తొలుత మోడల్ గా, ఆ తర్వాత హిందీ సినిమా 'రమణ్ రాఘవ్ 2.0'తో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది.