Vinesh Phogat: వినేష్ ఫొగాట్ జీవితం నుండి నేర్చుకోవలసిన ముఖ్య అంశాలివే
గత రెండు ఒలింపిక్స్‌లో కనీసం క్వార్టర్స్ దాటలేదు. అయినా వినేశ్ ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. తాను సాధిస్తానని బలంగా నమ్మింది. ఆ నమ్మకంతోనే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App53 కేజీల విభాగం నుంచి 50 కేజీల విభాగంలో పోటీ పడాలని వినేశ్ భావించింది. దాని కోసం బరువు తగ్గాలని భావించింది. బరువు తగ్గితే ప్రాణాపాయం అని వైద్యులు చెప్పినా అడుగు తన లక్ష్యం దిశగానే వేసింది. మడమ తిప్పలేదు.
వినేష్ తన జీవితాన్ని తానే నిర్మించుకుంది. కష్టాలకు భయపడి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. జంతర్ మంతర్ రోడ్లపైన అయినా.. ఒలింపింక్స్‌లో అయినా పోరాడింది.
వినేశ్ ఫొగాట్ విజయంలో కీలకపాత్ర పోషించిన అంశం క్రమశిక్షణ. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వినేష్ తన ప్రాక్టీస్, కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ స్పష్టమైన ఆలోచనలతో ఉంటారు. క్రమశిక్షణలో చిన్న లోపం కూడా రానివ్వరు
వినేష్ మారుమూల గ్రామం నుంచి వచ్చింది. అయినా ఒలింపిక్ పతకం సాధించాలన్న పెద్ద కల కనింది. దానిని నెరవేర్చుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసింది. భవిష్యత్ తరాలు కూడా ఇలాంటి కలలు కనాలి. వాటిని సాధించేందుకు పోాడాలి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, పోలీసుల లాఠీ దెబ్బలు కూడా వినేశ్ అత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. వినేష్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ముందు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అయినా పట్టు వదల్లేదు.
ఆడపిల్లలకు క్రీడలు ఎందుకు అన్న మాటలు వినిపించినా ఆ మాటలకు వినేశ్ భయపడలేదు. చాలామంది అమ్మాయిలను క్రీడల్లో ఎదిగేందుకు స్ఫూర్తిగా నిలిచింది.
వెయ్యి అసమానతలు ఉన్నా వినేశ్ వెనక్కి తగ్గలేదు. తన పోరాటం భవిష్యత్ తరాల కోసమే అని స్పష్టంగా ప్రకటించింది.
ఒలింపిక్స్‌లో పతకాన్ని నిలబెట్టుకునేందుకు వినేశ్ చేయాల్సిందంతా చేసింది. చివరికి రక్తం కూడా తీయించుకుంది. ఫలితం ఎలా ఉన్నా చివరి వరకూ మాత్రం పోరాడింది.
తనపైన తనకు అపారమైన నమ్మకం ఉంది. అందుకే తాను తప్పక ఒలింపిక్స్‌లో సాధిస్తానని వినేశ్ బలంగా నమ్మింది.