Ileana D'Cruz Photos: ఇల్లీబేబీ సూసైడ్ చేసుకోవాలనుకోవడం వెనుకున్న కారణం ఇదేనా
పోకిరి సినిమాతో టాలీవుడ్లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇలియానా. ఒకప్పుడు సౌత్‌లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది . ఎన్నో హిట్ చిత్రాల్లో ఈమె నటించి నతనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైం బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానాకి పెద్దగా కలసిరాలేదు. దీంతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండు చోట్లా ఆఫర్స్ కరువయ్యాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరోవైపు లవ్.. రిలేషన్షిప్.. అంటూ కొన్నాళ్లు హడావుడి చేసి ఇప్పుడు బ్రేకప్ చెప్పేసింది. ఇటు సినిమా ఆఫర్లు కూడా తగ్గాయ్. దీంతో కొంతకాలం సైలెంట్ అయిన ఇల్లీబేబి తీవ్రమైన డిప్రెషన్లో ఉందని.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనలు వస్తున్నాయంటోందనే వార్తలు ప్రచారం అయ్యాయి.
వాటిపై స్పందించిన ఇలియానా తాను సూసైడ్ చేసుకోవాలని భావించిన మాట నిజమే. కొన్ని ఊహించని పరిస్థితుల వల్ల డిప్రెషన్ లోకి వెళ్లా. దీనితో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా పుట్టాయి. కానీ మీడియాలో నా శరీరాకృతిపై వచ్చిన కామెంట్స్ వల్ల ఆత్మహత్య ఆలోచన చేసినట్లు రాశారు. అది చాలా బాధించింది. 12 ఏళ్ల వయసు లోనే నేను శరీరాకృతి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎప్పుడూ ఆ కారణంతో ప్రాణం తీసుకోవాలి అనుకోలేదని క్లారిటీ ఇచ్చింది.
అయితే కారణం ఫలానాది కాదు అని చెప్పింది కానీ..అసలు కారణం మాత్రం చెప్పలేదు. దీంతో కెరీర్, రిలేషన్ షిప్ లో ఫెయిలైందనే ఆలోచనతో ఆత్మహత్య చేసుకోవాలనుకుందా అనే డిస్కషన్ జరుగుతోంది. మరి కారణం ఏంటో ఇల్లీ చెప్పాలి మరి.
ఇలియానా (image credit : Ileana D'Cruz/Instagram)
ఇలియానా (image credit : Ileana D'Cruz/Instagram)
ఇలియానా (image credit : Ileana D'Cruz/Instagram)