YS Jagan: ఒకేరోజు 3 వివాహ వేడుకలకు హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండో రోజు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా నేడు రెండు వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. (Photo Credit: Twitter/@YSRCParty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకడప ఎన్‌జీఓ కాలనీలో ఐఏఎస్ అధికారి నారపురెడ్డి మౌర్య వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. (Photo Credit: Twitter/@YSRCParty)
ఇటీవల ఐఏఎస్ అధికారి వివాహం జరగగా, నేడు నూతన వధూవరులు నారపురెడ్డి మౌర్య, సత్యన్నారాయణరెడ్డిలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. (Photo Credit: Twitter/@YSRCParty)
అనంతరం ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుని మేయర్ సురేష్ బాబు కుమార్తె ఐశ్వర్య ముందస్తు వివాహ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. (Photo Credit: Twitter/@YSRCParty)
ఈ వివాహం రేపు జరగనుండగా.. నేడు అక్కడికి వెళ్లి ముందస్తు వివాహ వేడుకలకు హాజరై కడప మేయర్ కుమార్తెను ఆశీర్వదించారు. (Photo Credit: Twitter/@YSRCParty)
కడపలో వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడ నుంచి కర్నూలుకు ముఖ్యమంత్రి జగన్ పయనమయ్యారు. (Photo Credit: Twitter/@YSRCParty)
కడప నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ కర్నూలు చేరుకోగా అక్కడ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. (Photo Credit: Twitter/@YSRCParty)
కర్నూలులో వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కంగాటి ప్రదీప్ కుమార్‌రెడ్డి కుమారుడు వంశీధర్‌రెడ్డి వివాహ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. (Photo Credit: Twitter/@YSRCParty)
వరుడు వంశీధర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్. అనంతరం కర్నూలు నుంచి తాడేపల్లికి సీఎం జగన్ బయలుదేరారు. (Photo Credit: Twitter/@YSRCParty)