సీతా మహాలక్ష్మి అందాలు అదరహో.. కేన్స్ లో మృణాల్ స్టన్నింగ్ పోజులు..!
టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమాలలో రాణిస్తున్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. 2012లో ‘ముజ్సే కుచ్ కెహ్తీ.. యే ఖామోషియాన్’ అనే సీరియల్ ద్వారా మృణాల్ తన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'కుంకుమ భాగ్య' అనే హిందీ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్.. 2014లో 'విట్టి దండు' అనే మరాఠి సినిమాతో తొలిసారిగా బిగ్ స్క్రీన్ మీదకు వచ్చింది. లవ్ సోనియా, తూఫాన్, ధమకా, భట్లా హౌస్, ఘోస్ట్ స్టోరీస్, ధమాకా వంటి హిందీ చిత్రాలలో మెరిసింది మృణాల్. హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' సినిమాలో కీలక పాత్ర పోషించింది.
అంతకముందు కలర్స్ టీవీలో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ అనే స్పోర్ట్స్ రియాలిటీ షోలో పాల్గొంది. పాపులర్ డ్యాన్స్ రియాలిటీ టీవీ షో అయిన ‘నాచ్ బలియే’ 7వ సీజన్ లో కంటెస్టంట్ గా పార్టిసిపేట్ చేసింది మృణాల్.
'జెర్సీ' హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించిన మృణాల్.. 'సీతారామం' సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఎన్ని హిందీ సినిమాలు చేసినా రాని గుర్తింపు.. 'సీతారామం' చిత్రంతో వచ్చింది. సీతా మహాలక్ష్మిగా, ప్రిన్సెస్ నూర్జహాన్ గా అమ్మడు తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది.
సోషల్ మీడియాలో యాక్టిివ్ ఉండే మృణాల్ ఠాకూర్.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా ఫ్రాన్స్ లో అట్టహాసంగా జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్-2023 లో రెడ్ కార్పెట్ పై మృణాల్ సందడి చేసింది.
మోడ్రన్ దుస్తుల్లో హాట్ పోజులతో మృణాల్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి. ఆ ఫోటోలను అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ స్టన్నింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కు, నన్ను నేను దేశీ అమ్మాయిలా భావించేలా చేసినందుకు ధన్యవాదాలు అంటూ తన కాస్ట్యూమ్ డిజైనర్స్ కి థ్యాంక్స్ చెప్పింది మృణాల్.