Happy Birthday Balakrishna: బాలకృష్ణ బర్త్ డే స్పెషల్... ఆయన కెరీర్లో హయ్యస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసా?
Balakrishna Top Five Highest Grossing Movies: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ బర్త్ డే జూన్ 10న. అంటే ఆ రోజు అభిమానులకు పండగ రోజు. సుమారు నాలుగు దశాబ్దాల కెరీర్లో బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ సినిమాలు చేశారు. ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ చేశారు. మరి, ఆ సినిమాల్లో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన టాప్ ఫైవ్ ఫిలిమ్స్ ఏవో తెలుసా?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలకృష్ణ కెరీర్లో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమా 'వీర సింహా రెడ్డి'. సంక్రాంతి సందర్భంగా 2023లో ఈ మూవీ విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 135 కోట్ల గ్రాస్ సాధించి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిందని టాలీవుడ్ ట్రేడ్ టాక్. షేర్ రూ. 80 కోట్లు వచ్చిందట.
బాలకృష్ణ కెరీర్లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ సాధించిన సినిమా 'అఖండ'. ఆయన డ్యూయల్ రోల్ చేశారు. అఘోరాగా ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కరోనా తర్వాత ప్రేక్షకులు ట్రాక్టర్లు వేసుకుని మరీ థియేటర్లకు వచ్చేలా చేసిన చిత్రమిది. 'సింహ', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హ్యాట్రిక్ చిత్రమిది. సుమారు 50 కోట్ల నిర్మాణ వ్యయంతో తీసిన ఈ సినిమా రూ. 130 కోట్ల గ్రాస్ సాధించింది.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు పక్కనపెట్టి... కంటెంట్ మీద నమ్మకంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలకృష్ణ చేసిన సినిమా 'భగవంత్ కేసరి'. ఆయన నుంచి అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలు ఉన్నాయి. అదే సమయంలో వయసుకు తగ్గ పాత్రలో కనిపించరు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 125 కోట్లు అని ట్రేడ్ టాక్.
ఎటువంటి జానర్ సినిమా అయినా చెయ్యగల కథానాయకుడు బాలకృష్ణ. ఆయన వందో సినిమాగా చారిత్రాత్మక కథతో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చేశారు. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్ల గ్రాస్ సాధించిందని సమాచారం. దర్శకుడు క్రిష్ రూ. 45 కోట్లలో సినిమా తీయగా... నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చింది.
సుమారు ఆరేళ్ల పాటు బాలకృష్ణ స్థాయికి తగ్గ సినిమాలు రావడం లేదని ఫ్యాన్స్ అందరూ నిరాశలో ఉన్న సమయంలో 'సింహ' అంటూ విజయం అందించిన బోయపాటి శ్రీను... ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర 'లెజెండ్'తో బాలకృష్ణ సత్తా ఏమిటో చూపించారు. ఆ సినిమా ఆల్మోస్ట్ రూ. 70 కోట్ల గ్రాస్ సాధించింది. 'సింహ' సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ సాధించింది. బాలకృష్ణ టాప్ 6 హిట్ సినిమాల లిస్టులో మూడు బోయపాటి శ్రీనువి కావడం గమనార్హం.