Aditi Rao Hydari: బ్లాక్ అండ్ వైట్ ఔట్ఫిట్ లో మెరిసిపోతున్న అందాల అదితిరావు హైదరీ
ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల ఫ్రాన్స్ లో అట్టహాసంగా ముగిసింది. వరల్డ్ వైడ్ గా పేరుగాంచిన సినీ తారలు, డిజైనర్లు పాల్గొనే ఈ వేడుకలో అదితిరావు హైదరీ పాల్గొంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాదీ ముద్దుగుమ్మ అదితి రావు రెడ్ కార్పెట్ పై సందడి చేసిన ఫోటోలను ఇప్పటికే తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాజాగా మరికొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో అందరినీ ఆకట్టుకోడానికి కారణమైన లోరియల్ పారిస్ ఫ్యామిలీకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పింది.
బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ దుస్తుల్లో హొయలు పోతున్న హైదరీ ఎర్ర తివాచీపై మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
తెలంగాణా ప్రాంతానికి చెందిన వనపర్తి సంస్థానాధీశుల ఆఖరి రాజు రామేశ్వరరావు మనువరాలైన అదితిరావ్ హైదరీ.. 2006లో 'ప్రజాపతి' అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసింది.
'శృంగారం' అనే తమిళ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. 'ఢిల్లీ 6' మూవీలో చిన్న పాత్ర చేయడం ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో అనేక సినిమాల్లో నటించింది.
'సమ్మోహనం' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. 'అంతరిక్షం', 'వి', 'మహా సముద్రం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ఇటీవల హీరో బొమ్మరిల్లు సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న హైదరీ.. చివరగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన 'హీరామండి' వెబ్ సిరీస్ తో మెప్పించింది.
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదితిరావు హైదరీ