Subhashree Rayaguru: చాలా మారిపోయావ్ శుభశ్రీ - పూల్ సైడ్.. సింపుల్ లుక్‌లో ‘బిగ్ బాస్’ బ్యూటీ
‘‘మనోభావాలు దెబ్బతిన్నాయ్’’ అంటూ.. మీమ్ మెటీరియల్‌గా మారిన శుభశ్రీ గుర్తుందా? తెలుగు పరిశ్రమలో స్థిరపడేందుకు వచ్చిన ఈమెకు ‘బిగ్ బాస్’ దయ వల్ల మంచి గుర్తింపే వచ్చింది. అయితే, సినిమాల్లో మాత్రం పెద్దగా ఛాన్సులు లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది శుభశ్రీ. తాజాగా పూల్ సైడ్.. కూల్‌గా కూర్చొని అభిమానులకు ఛీర్స్ చెప్పింది. - Subhashree Rayaguru/Instagram
శుభశ్రీ.. తెలుగు అమ్మాయి కాదనే సంగతి తెలిసిందే. ఆమె ఒడిశాలో పుట్టి పెరిగింది. అయితే, ముంబయిలో ఎల్.ఎల్.బి. పూర్తి చేసింది. ఆ తర్వాత న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేసింది. - Subhashree Rayaguru/Instagram
అయితే, శుభశ్రీకి.. సినీ రంగమంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే.. ప్రాక్టీస్ వదిలేసి టాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మోడలింగ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది. - Subhashree Rayaguru/Instagram
2022లో ‘రుద్రవీణ’ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ప్రవేశించింది. అనంతరం ‘అమిగోస్’, ‘కథ వెనుక కథ’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘OG’ సినిమాలో నటిస్తోంది. - Subhashree Rayaguru/Instagram
గతేడాది బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చింది శుభశ్రీ. అమర్ దీప్‌తో గొడవపడి నా మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అది కాస్తా మీమ్‌గా మారడంతో శుభశ్రీకి మరింత గుర్తింపు వచ్చింది. - Subhashree Rayaguru/Instagram
బిగ్ బాస్ షో తర్వాత శుభశ్రీ ఓ యూట్యూబ్ చానెల్‌తో అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఇటీవల సింగర్ భోలేతో కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోనూ మెరిచింది. - Subhashree Rayaguru/Instagram