Ram Charan-Klin Kaara: ఫాదర్స్ డే.. కూతురితో రామ్ చరణ్ ఆటలు - క్యూట్ ఫోటో వైరల్
Ram Charan-Klikaara Photo: మెగా ఫ్యామిలీ నుంచి ఫాదర్స్ డే స్పెషల్ ఫోటో వచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేడు జూన్ 16 ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్-క్లింకారల క్యూట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో చరణ్, క్లింకారతో ఆడుతూ తండ్రిగా మురిసిపోతున్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో చరణ్ క్లింకారను పైకి గాల్లోకి ఎగిరేస్తూ కూతురితో ఆడుకుంటున్నాడు.
ఇక క్లింకార తండ్రిని చూస్తూ స్మైల్ ఇస్తున్న ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇలా చరణ్-క్లింకారలను చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ఈ ఫోటోల్లో క్లింకార ఫేస్‌ను కాస్తా రివీల్ చేశాడు రామ్ చరణ్. ఫ్యాన్స్‌కి ఫాదర్స్ డే గిఫ్ట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
కాగా నిన్న రామ్ చరణ్-ఉపాసనలు తమ 12వ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా క్లింకారు పట్టుకుని నడుస్తున్న ఫోటో షేర్ చేసింది ఉపాసన.
ఈ ఫోటోను కూడా సోషల్ మీడయాలో బాగా ఆకట్టుకుంది. కాగా చరణ్-ఉపాసనలకు పెళ్లయిన పదేళ్ల తర్వాత క్లింకార జన్మించింది.