Indhra Ram: తెలుగులో చిరంజీవి, తమిళంలో విజయ్ సేతుపతి... హ్యాపీ బర్త్ డే టు 'చౌర్య పాఠం' హీరో ఇంద్ర రామ్
Chaurya Paatam Movie Hero: హీరో ఇంద్ర రామ్ (Velivela Indhra Ram)కు 'చౌర్య పాఠం' టీమ్ బర్త్ డే విషెష్ చెప్పింది. ఇవాళ (మే 26) ఆయన బర్త్ డే. ఈ సినిమా కోసం ఇంద్ర రామ్ రెండేళ్లు కష్టపడ్డారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు...
Download ABP Live App and Watch All Latest Videos
View In App'చౌర్య పాఠం' సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కథ అందించారు. కథ నచ్చడంతో మరొక దర్శకుడు, 'ధమాకా'తో వంద కోట్ల క్లబ్బులో చేరిన త్రినాథ రావు నక్కిన నిర్మాతగా మారారు. ఇందులో అవకాశం ఇంద్ర రామ్ కు అంత ఈజీగా ఏమీ రాలేదు. దాని వెనుక ఓ కథ ఉంది.
'చౌర్య పాఠం' సినిమాకు ముందు మరొక సినిమా చేయాలని ఇంద్ర రామ్ ట్రై చేశారు. త్రినాథ రావు నక్కినను కలిశారు. కానీ, కుదరలేదు. ఆ తర్వాత 'చౌర్య పాఠం' గురించి తెలిసింది. అవకాశం కోసం వెళితే... కథ రాసిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడు నిఖిల్ గొల్లమారికి నచ్చాలని త్రినాథరావు నక్కిన కండిషన్ పెట్టడంతో వెళ్లి ఆడిషన్ ఇచ్చారు ఇంద్ర రామ్. ఆయన టాలెంట్ నచ్చడంతో అవకాశం ఇచ్చారు.
కథే సినిమాకు అసలైన హీరో నమ్మే హీరో ఇంద్ర రామ్. 'చౌర్య పాఠం' ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి ఇస్తుందని ఇంద్ర రామ్ తెలిపారు. ఈ ఒక్క సినిమా తనకు నాలుగైదు సినిమాల ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఇంద్ర రామ్ వివరించారు.
'చౌర్య పాఠం'తో హీరోగా వస్తున్న ఇంద్ర రామ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. బీటెక్ చేశాక హీరోగా అవకాశాల కోసం ట్రై చేయడం మొదలు పెట్టారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తనకు స్ఫూర్తి అని ఆయన తెలిపారు. తమిళంలో విజయ్ సేతుపతి తన స్ఫూర్తి అన్నారు.
'చౌర్య పాఠం' విడుదలకు ముందు హీరోగా ఇంద్ర రామ్ మరో అవకాశం అందుకున్నారు. తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థలో ఆయన సినిమా చేయబోతున్నారు. 'చౌర్య పాఠం' విడుదల అయ్యాక ఆ సినిమా వివరాలు వెల్లడి కానున్నాయి.