NBK 109 Launch Photos : బాలకృష్ణ కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు - ఎవరెవరు వచ్చారో చూశారా?
ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'వాల్తేరు వీరయ్య' ఫేమ్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఆయన హీరోగా కొత్త సినిమా మొదలైంది. హీరోగా ఆయనకు 109వ చిత్రమిది. అందుకని, 'NBK 109 movie' (వర్కింగ్ టైటిల్) గా వ్యవహరిస్తున్నారు. ఎన్బికె 109 ప్రారంభోత్సవంలో నవ్వులు చిందిస్తున్న బాలకృష్ణ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి, సూర్యదేవర నాగవంశీ పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించి చిత్ర పనులు ప్రారంభించారు.
పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్‌ను దర్శకుడు వి.వి. వినాయక్ తన చేతుల మీదుగా చిత్ర బృందానికి అందజేశారు.
దక్షిణ కొరియా గౌరవ కౌన్సెల్ జనరల్ చుక్కపల్లి సురేష్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచాన్ చేశారు. మొదటి షాట్ కి మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
ఎన్బికె 109 ప్రారంభోత్సవంలో బాలకృష్ణ
ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో తెలిపేలా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది. మద్యం సీసా, గొడ్డలి, ఇతర పదునైన ఆయుధాలతో కథానాయకుడి పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో తెలియజేశారు. ఆ కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఎన్బికె 109 ప్రారంభోత్సవంలో ఓ దృశ్యం
బాలకృష్ణతో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ d
బాలకృష్ణ
ఎన్బికె 109 ప్రారంభోత్సవంలో ఓ దృశ్యం
ఎన్బికె 109 ప్రారంభోత్సవంలో దేవుని చిత్రపటాలు