Arjun Daughter Marriage: పెళ్లి చేసుకున్న 'యాక్షన్ కింగ్' అర్జున్ కూతురు ఐశ్వర్య - వరుడు ఎవరంటే..!
Arjun Sarja Daughter Aishwarya and Umpathy Ramaiah Marriage Photos: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట పెళ్లీ భాజాలు మోగాయి. ఆయన పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో ఆమె ఏడడుగులు వేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచెన్నైలో హనుమాన్ ఆలయంలో సింపుల్ వారి పెళ్లి జరిగింది. ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకు కొద్దిమంది బంధుమిత్రులు, ఇండస్ట్రీవర్గాలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఐశ్వర్య, ఉమాపతిలు స్వయంగా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
దీంతో వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కొత్త జంటకు నెటిజన్లు, ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.కాగా గతేడాది ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో సింపుల్ ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది.
కాగా కొత్తకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు తాజాగా పెళ్లి బంధంలో ఒక్కటయ్యారు. స్టార్ హీరో కూతురైన ఐశ్వర్య సినీ కెరీర్ అంత సక్సెస్ ఫుల్ సాగడం లేదు. 2013లో విశాల్ నటించిన 'పట్టతు యానై' అనే తమిళ చిత్రంలోనే ఆమె కోలీవుడ్ ఆరంగేట్రం చేసింది.
ఇక చివరిగా తన తండ్రి, అర్జున్ సర్జా స్వయంగా దర్శకత్వం వహించిన 'ప్రేమ బరహ' సినిమాలో హీరోయిన్ నటించింది. కానీ ఇది ఆశించిన విజయం సాధించింది. ఇక ఆమె హీరోయిన్గా యంగ్ విశ్వక్ సేన్‌తో ఓ తెలుగు సినిమాను ప్రకటించిన అది వర్కౌట్ కాలేదు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఇక ఉమాపతి విషయానికి వస్తే అతడు ప్రముఖ డ్యాన్స్, కొరియోగ్రఫరైన అతడు 2017లో 'అడగపట్టదు మగజనంగాలే' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. చివరిగా తన తండ్రి, నటుడు తంబి రామయ్య రచన-దర్శకత్వం లో తెరకెక్కిన 'మణియార్ కుటుంబం'లో ప్రధాన పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.