బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న అనసూయ.. రంగమ్మత్త చూపులతోనే కైపెక్కిస్తోందిగా!
సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, హీరోయిన్లు తమ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటున్నారు. సినిమాలకు సంబంధించిన సంగతులే కాదు, పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు. రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ.. తమ అందచందాలతో నెట్టింట సందడి చేస్తున్నారు. తాజాగా అనసూయ తన లేటెస్ట్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. స్మాల్ స్క్రీన్ కు గ్లామర్ అద్దిన యాంకర్లలో ఆమె ముందు వరుసలో ఉంటారు. ఓవైపు టీవీ షోలలో తన హాట్ నెస్ తో అదరగొడుతూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లోనూ సత్తా చాటుతోంది.
సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తరచుగా హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. అదే సమయంలో ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. ఇద్దరు బిడ్డల తల్లి అలాంటి చిట్టి పొట్టి డ్రెస్సులు ధరించడంపై నెగటివ్ కామెంట్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.
అయితే నెటిజన్ల ట్రోలింగ్ ను ఏమాత్రం పట్టించుకోని అనసూయ.. ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచి ఫోటోలు షేర్ చేస్తుంది. అలానే వీలుకుదిరినప్పుడల్లా ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వారిపై పోలీసు కేసులు పెట్టడానికి కూడా ఆమె వెనకాడలేదు.
ఇటీవల అనసూయ స్విమ్మింగ్ ఫూల్ లో తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె బికినీలో కనిపించడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేసారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాస్త పద్ధతిగా కనిపించే ఫోటోలతో వచ్చింది. అయినప్పటికీ ఆమె కైపెక్కించే చూపులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
బ్లూ డ్రెస్ లో అందాల యాంకరమ్మ మెరిసిపోతోంది. వివిధ భంగిమల్లో కనివిందు చేస్తున్న అనసూయా భరద్వాజ్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
'నాగ' చిత్రంలో తెరంగేట్రం చేసిన అనసూయ.. చాలా ఏళ్ళ తర్వాత 'సోగ్గాడే చిన్నినాయనా' 'క్షణం' 'ఎఫ్ 2' 'మీకు మాత్రమే చెప్తా' యాత్ర, 'రంగస్థలం', పుష్ప వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో 'పుష్ప 2' చిత్రంతో పలకరించబోతోంది.