Nagarjuna in Mumbai: ముంబై బీచ్‌లో నాగార్జున, ధనుష్ - ఫ్యాన్స్‌లో ఒకటే జోష్, ఈ సారి కూడా తోసేశారా?
అక్కినేని నాగార్జున్, ధనుష్ నటిస్తున్న ‘కుబేరా’ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగార్జున, ధనుష్‌తోపాటు దర్శకుడు శేఖర్ కమ్ముల జుహు బీచ్‌లో చక్కర్లు కొట్టారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాగార్జున, ధనుష్‌లను చూసేందుకు స్థానిక ప్రజలు అక్కడ గుడిగూడారు. కొంతమంది అభిమానులు వారితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే, ధనుష్ సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం ఓ అభిమానిని పక్కకు తోసేశారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ సారి నాగార్జున మాత్రం జాగ్రత్తగా వ్యవహరించారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటన రిపీట్ కాకుండా అప్రమత్తంగా ఉన్నారు. ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టొద్దని తన సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు.
అడిగిన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ కూల్‌గా కనిపించారు నాగార్జున. అక్కడ పరిస్థితి గందరగోళంగా మారడంతో షూటింగ్‌కు విరామం ఇచ్చినట్లు తెలిసింది.
‘కుబేర’ మూవీని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.