Adivi Sesh: స్పై థ్రిల్లర్ సీక్వెల్ 'G2 Movie'లో సిక్స్ స్టన్నింగ్ మూమెంట్స్ రివీల్ చేసిన శేష్ - గూఢచారి 2 స్టిల్స్ చూశారా?
టాలీవుడ్... ఆ మాటకు వస్తే పాన్ ఇండియన్ లెవల్ లో చూసినా సరే... లేటెస్ట్ జేమ్స్ బాండ్ ఎవరు? అంటే ఠక్కున వినిపించే పేరు అడివి శేష్. ప్రజెంట్ ఆయన హీరోగా నటిస్తున్న సినిమా 'జీ 2' (అంటే గూఢచారి 2). ఆరేళ్ళ క్రితం విడుదలైన 'గూఢచారి'కి సీక్వెల్ ఇది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'గూఢచారి' విడుదలై ఆరేళ్లు పూర్తి అయిన సందర్భంగా #G2 నుంచి ఆరు స్టన్నింగ్ మూమెంట్స్ (స్టిల్స్) విడుదల చేశారు హీరో అడివి శేష్. వరుస ఫోటోలు విడుదల చేసి అభిమానులను థ్రిల్ చేశారు.
'గూఢచారి' సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సంగతి తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయమే. హిందీలో 'మేజర్' మంచి పేరు, విజయం సాధించిన తరుణంలో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. అందుకని, అక్కడి నటుడిని సెలెక్ట్ చేసినట్టు ఉన్నారు.
'గూఢచారి'కి సీక్వెల్ గా 'జీ 2' షూటింగ్ 40 పర్సెంట్ కంప్లీట్ అయ్యిందని దర్శక నిర్మాతలు తెలిపారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Goodachari 2 Movie Release Date: 2025 సెకండ్ హాఫ్... అంటే వచ్చే ఏడాది వేసవి తర్వాత 'జీ 2' సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇస్తుందని చెప్పారు.
ఈ స్టిల్ చూస్తుంటే... G2 Movieలో అడివి శేష్ అరెస్ట్ అయ్యే సీన్ కూడా ఉన్నట్టు అర్థం అవుతోంది. మరిన్ని వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.