Sonakshi Sinha Zaheer Iqbal Wedding Reception: సోనాక్షి వెడ్డింగ్ రిసెప్షన్లో సౌత్ స్టార్స్ డామినేషన్ - వీళ్లంతా మనోళ్లే
పెళ్లి తర్వాత కొత్త జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ మీడియా ముందుకు కలిసి వచ్చారు. సోలోగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి వాళ్లిద్దరూ నిరాకరించారని ముంబై మీడియా తెలిపింది. ఒకప్పటి హిందీ హీరో, ప్రస్తుత ఎంపీ, తండ్రి శత్రుఘ్న సిన్హా ఇంటిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు సోనాక్షి సిన్హా. ఆ తర్వాత గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖుల్లో పలువురు సౌత్ స్టార్స్ ఉన్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ ప్రేక్షకులకు సైతం ఎంతో సుపరిచితుడైన కథానాయకుడు, హైదరాబాదీ అమ్మాయి - హీరోయిన్ అదితి రావు హైదరి జంటగా సందడి చేశారు.
ఉత్తరాది అమ్మాయి అయినా సరే... కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. బ్లాక్ డ్రస్ ధరించి గ్లామర్ తళుకులతో సోనాక్షి సిన్హా రిసెప్షన్ కు హాజరైంది.
ప్రస్తుతం హిందీ సినిమాల్లో ఎక్కువ నటిస్తున్న నటి టబు. ఆమె కూడా హైదరాబాద్ మహిళే. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కథానాయికగా చేశారు. తెలుగు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత హిందీకి వెళ్లి సెటిల్ అయ్యారు.
సోనాక్షి సిన్హా తల్లిదండ్రులు శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హా కుమార్తె పెళ్లి రిసెప్షన్లో ఇలా సందడి చేశారు.
'వెన్నెలవే వెన్నెలవే...' పాట ఎవర్ గ్రీన్. అది ఉన్నంత కాలం సౌత్ ప్రేక్షకులకు కాజోల్ తప్పకుండా గుర్తు ఉంటారు. సోనాక్షి సిన్హా పెళ్లి రిసెప్షన్లో ఆవిడ ఇలా సందడి చేశారు.
బాలీవుడ్ భామ, సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా', అజిత్ 'వలిమై' సినిమాల్లో నటించిన హ్యూమా ఖురేషి తెల్లటి దుస్తుల్లో సోనాక్షి - జహీర్ రిసెప్షన్లో మెరిశారు.
జహీర్ ఇక్బాల్ తల్లిదండ్రులు... పెళ్లి తర్వాత సోనాక్షి మతం మారదని జహీర్ తండ్రి ముందుగా చెప్పారు.
హైదరాబాదీ అమ్మాయి అదితి రావు హైదరికి హిందీలోనూ మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్య సంజయ్ లీలా భన్సాలీ తీసిన 'హీరామండీ' వెబ్ సిరీస్ తో హిట్ అందుకున్నారు.
వెడ్డింగ్ రిసెప్షన్లో సిన్హా ఫ్యామిలీ సభ్యులు. ఈ పెళ్లి కోసం అమెరికా నుంచి కొంత మంది వచ్చారు.