Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Supritha: మంచి అబ్బాయి జాడ చెప్పమంటున్న సురేఖ వాణి కూతురు సుప్రిత - అప్పుడే పెళ్లికి రెడీ అయ్యిందా?
Supritha Stunning in Saree Look: నటి సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందే ఈమే సోషల్ మీడియాలో బాగా ఫేమస్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతల్లి సురేఖతో తరచూ రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు తన గ్లామరస్ లుక్‌తోనూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఈ క్రమంలో ఆమె ట్రోలర్స్ నుంచి ట్రోల్స్ కూడా ఎదుర్కొనేది. అయినా తగ్గేదే లే అంటూ తన ఫోటోలు ఇన్‌స్టా వేదిక షేర్ చేస్తూనే ఉంటుంది. ఒక్కొసారి ట్రెండీ లుక్‌లో, ఒక్కొసారి ట్రెడిషనల్‌గా కనిపిస్తూ సర్ప్రైజ్ చేస్తుంది.
మొత్తానికి ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సుప్రీత తాజాగా చీరలో ఆకట్టుకుంటుంది. గోల్డ్ కలర్ సిల్క్ చీరలో సుప్రిత అందంగా ముస్తాభైంది.ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. అలెక్సా, మంచి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో చెప్పు(Alexa, show me directions to a good man) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏంటీ సుప్రీత పెళ్లికి రెడీ అయ్యిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రిత శారీ లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.