Anandhi: కొంటె చూపులతో కట్టిపడేస్తున్న అందాల ఆనంది.. ఫోటోలు వైరల్!
తెలుగమ్మాయి ఆనంది తెలుగులో కంటే తమిళంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తూ వచ్చింది.
పెళ్ళి తర్వాత కూడా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ.. తనకు నప్పే పాత్రలను ఎంపిక చేసుకుంటోంది.
ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న ఆనంది.. రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.
లేటెస్టుగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
కొంటె చూపులతో కట్టిపడేస్తున్న ఆనంది క్యూట్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
'ఈ రోజుల్లో' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. 'బస్ స్టాప్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.
తెలుగులో క్రేజీ ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసిన ఆనంది.. అక్కడ 'కయల్' ఆనందిగా మారిపోయింది.
పరియేరుమ్ పెరుమాళ్, చండీవీరన్, త్రిష ఇల్లన్నా నయనతారా, మన్నర్ వగైయార్, ఎన్ ఆలోడ చెరుప్పు కానోమ్ వంటి పలు తమిళ చిత్రాల్లో నటించింది.
'జాంబి రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 'కస్టడీ' మూవీలో కీలక పాత్ర పోషించింది.