Pooja_Hegde: హాట్ ఫొటోలతో నెటిజన్లను గిల్లుతున్న పూజా హెగ్డే.. బుట్టబొమ్మ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
2012లో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పూజాహెగ్డే వచ్చే ఏడాదికి పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో సెగలు రేపుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడిఫరెంట్ సినిమాలు చేసే ఈ అమ్మడు గ్లామర్ విషయంలోనూ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈ మధ్య చేసిన ఓ ఫొటోషూట్ ఫొటోలనూ ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ నెటిజన్లను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది పూజా హెగ్డే
ప్రస్తుతం పూజా హెగ్డే ఐదు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో మూడు సినిమాలతో బిజీగా ఉంది..
తెలుగులో పూజా హెగ్డే నటిస్తున్న మోస్టు ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీలో అక్కినేని అఖిల్‌తో పూజ రొమాన్స్ చేస్తోంది.
ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆచార్యలో కూడా పూజా హెగ్డే కీలకపాత్ర పోషించింది. ఈమెతో పాటు మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ రాధే శ్యామ్‌లో కూడా పూజా హెగ్డే మెస్మరైజ్ చేయనుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌లో అదరగొట్టిన పూజా.. యంగ్ రెబల్ స్టార్‌కు తగిన జోడీ అంటూ ప్రశంసలు అందుకుంది.
రాధేశ్యామ్ సినిమా హిందీ, తెలుగు భాషల్లో షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాకు రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తుంటే.. యూవీ క్రియేన్స్ నిర్మిస్తోంది.
తమిళ హీరో విజయ్ నటిస్తున్న బీస్ట్‌లో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాను నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తుంటే.. సన్ పిక్సర్స్ నిర్మిస్తోంది.
సర్కస్ అనే హిందీ కామెడీ సినిమాలోనూ పూజా హెగ్డే సందడి చేయనుంది. ఇందులో రణ్‌వీర్‌సింగ్ డబుల్ రోల్ చేస్తున్నాడు.