Chiranjeevi Ram Charan: మెగా మూమెంట్ - రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లేముందు అభిమానులతో చిరంజీవి, రామ్ చరణ్
శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని మర్యాదా పురుషోత్తముడు రాముని మందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆహ్వానాలు అందుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లనున్నారు. వాళ్లకు సెండాఫ్ ఇవ్వడానికి ఆదివారం రాత్రి మెగాస్టార్ ఇంటికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. తమ అభిమాన హీరోలు, తండ్రి తనయులను చూసి మురిసిపోయారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచలి, రాత్రిని సైతం లెక్క చేయకుండా ఇంటికి వచ్చిన అభిమానులకు చేతులెత్తి ఆత్మీయంగా నమస్కరిస్తున్న చిరంజీవి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లడానికి ఆయన ఎగ్జైటెడ్ గా ఉన్నారని సమాచారం. హనుమంతుడు అంటే మెగాస్టార్ చిరంజీవికి అపారమైన భక్తి అనేది ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. ఆ హనుమంతుని గుండెల్లో కొలువైన రాముడు అన్నా అంతే భక్తి, గౌరవం.
అభిమానులకు అభివాదం చేస్తున్న రామ్ చరణ్. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో పతాక సన్నివేశాలకు ముందు అల్లూరి సీతారామ రాజు వేషధారణలో ఆయన చూపిన నటనకు ఉత్తరాది ప్రేక్షకులు సైతం అభిమానులు అయ్యారు. థియేటర్లలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయోధ్యలో రామ్ చరణ్ కు ఘన స్వాగతం లభించే అవకాశాలు ఉన్నాయి.
ఒక్క ఫ్రేములో మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
చిరంజీవి, రామ్ చరణ్ లకు హనుమంతుని ప్రతిమ బహుకరిస్తున్న మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు
రామ్ చరణ్
మెగాస్టార్, గ్లోబల్ స్టార్... ఇద్దరినీ చూడటానికి వచ్చిన అభిమానులు