Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
BiggBoss 8 Telugu Nikhil: బిగ్ బాస్ హౌస్ లో 'ఊర్వశివో రాక్షసివో' సీరియల్ హీరో నిఖిల్!
తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది.అందులో సీరియల్ నటుడు నిఖిల్ పేరుకూడా ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోరింటాకు సీరియల్ తో పాపులర్ అయిన నిఖిల్...ప్రస్తుతం ఊర్వశివో రాక్షసివో సీరియల్ లో నటిస్తున్నాడు. విజయేంద్ర పాత్రలో ఫుల్ మార్క్స్ కొట్టేశాడు.
వైష్ణవిని ప్రేమించి అనుకోకుండా విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. తన బాబాయ్ పిన్ని కుట్రలకు బలై అనుకోకుండా విదేశాల్లో జైల్లో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి తిరిగివచ్చిన తర్వాత దుర్గను పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. వైష్ణవి రూపం మార్చుకుని దుర్గగా వచ్చిందని ఆ తర్వాత తెలుసుకుని సంబరంలో ఉంటాడు.
తన పిన్ని, బాబాయ్ కుట్రలకే తన తండ్రి, దుర్గ తండ్రి బలయ్యారని తెలుసుకుని వారి అసలు రంగు బయటపెట్టే పనిలో పడ్డాడు విజయేంద్ర. దుర్గ సపోర్ట్ తో ఓ వైపు ఆధారాలు సేకరిస్తుంటే మరోవైపు రక్షితగా నటించిన ప్రగతి..దుర్గను టార్గెట్ చేసింది. మొత్తానికి ఈ సీరియల్ కథ కూడా క్లైమాక్స్ కి చేరినట్టే ఉంది.. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లడం కూడా ఓ కారణం అయి ఉండొచ్చేమో...
సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభం కానుందని ఇప్పటికే అపీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. నాగార్జునే మరోసారి హోస్ట్ గా చేయబోతున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో నిఖిల్ తో పాటూ..టీమ్ స్ట్రాంగ్ గానే ఉంది.
సీరియల్ నటుడు నిఖిల్ (Image Credit: nikhilmaliyakkal/ Instagram)