Bhagyashri Borse: జాన్వి కపూర్ కి పోటీగా మారబోతున్న బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బ్యూటిఫుల్ ఫొటోస్

జాన్వి కపూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టిందో లేదో...ఒక్క సినిమా అయినా రిలీజ్ కాకముందే వరుస ఆఫర్స్ అందుకుంది. ఎన్టీఆర్ దేవర మూవీ కాకుండా మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఇప్పుడు ఇదే రూట్లో ఉంది బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ
Download ABP Live App and Watch All Latest Videos
View In App
జాన్వికపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తూనే ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా మూవీలో సత్తాచాటుతోంది. ఇదింకా షూటింగ్ దశలో ఉండగానే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోయే RC16 లో హీరోయిన్ గా ఫైనలైంది. మరోవైపు నానితో మూవీలోనూ హీరోయిన్ గా ఫిక్సైంది...అలాగే దేవర పార్ట్ 2 లోనూ ఎలాగూ ఉంటుంది.. భాగ్యశ్రీ బోర్సే కూడా వరుస ఆఫర్స్ కి సైన్ చేసింది

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోన్న భాగ్యశ్రీ బోర్సే..ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా ఫిక్సైంది. దాంతో పాటూ దుల్కర్ సల్మాన్ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది. అంటే ఫస్ట్ మూవీ రిలీజవకముందే మరో రెండు సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది
ఈ మూవీస్ సక్సెస్ పై తర్వాత ప్రాజెక్టులు ఆధారపడి ఉంటాయన్నది పక్కా..మరి జాన్వి - భాగ్యశ్రీలో ఎవరు ఎవరికి పోటీగా మారుతారో వెయిట్ అండ్ సీ...
భాగ్యశ్రీ బోర్సే ( image credit : Bhagyashree Borse/ Instagram)