Allu Arjun: న్యూయార్క్ లో 'పుష్ప'రాజ్ మ్యానియా- 'తగ్గేదెలే' అంటోన్న న్యూయార్క్ మేయర్
న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పరేడ్ లో పాల్గొన్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సతీమణి స్నేహా రెడ్డి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత్ 75 వ స్వాతంత్ర్య దినోత్సవాలను న్యూయార్క్ లో ఘనంగా నిర్వహించారు. ఈ పరేడ్ లో అల్లు అర్జున్ కి స్వాగతం చెప్తూ ఇలా ప్లకార్డ్ ప్రదర్శించారు.
ఈ ఇండియా డే పరేడ్ లో సుమారు 5 లక్షల మందికి పైగా హాజరయ్యారు. దీనికి అల్లు అర్జున్ నాయకత్వం వహించారు.
న్యూయార్క్ మేయర్ ఎరిక్ అడమ్స్ తో కలిసి తగ్గేదెలే అంటోన్న 'పుష్ప' స్టార్ అల్లు అర్జున్
ప్రవాస భారతీయులతో కలిసి మెగా పరేడ్ లో పాల్గొన్న అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు.
ఇండియా డే పరేడ్ కి వచ్చినందుకు గాను ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న అల్లు అర్జున్.
బన్నీ.. బన్నీ అని అరుస్తూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. Image Credit: Sarath Chandra Naidu/Twitter
ఈ సందర్భంగా అల్లు అర్జున్ హిందీలో ప్రసంగించారు. ఆయన ‘పుష్ప’ సినిమాలోని పాపులర్ డైలాగ్ చెప్పారు. ‘‘యే భారత్ కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..’’ అంటూ ర్యాలీలో పాల్గొన్న జనాలను ఉర్రూతలూగించారు. Image Credit: Sarath Chandra Naidu/Twitter
భారతీయుడిగా జన్మించడం పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ అందరినీ ఉత్సాహపరిచారు. Image Credit: Sarath Chandra Naidu/Twitter
స్టైలిష్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్. Image Credit: Sarath Chandra Naidu/Twitter