Mounika reddy Photos: ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న'భీమ్లా నాయక్' బ్యూటీ - ఫొటోలు వైరల్
Mounika Reddy Photos: నటి మౌనిక రెడ్డి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరీ ముఖ్యంగా ఈ నటికి ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం భీమ్లా నాయక్‌తోనే అని చెప్పాలి. ఇందులో లేడీ కానిస్టేబుల్‌గా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కనే లేడీ కానిస్టేబుల్ లో చాలా ఎమోషన్స్ పండించింది.
ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ హీరోగా చేసిన సూర్య వెబ్ సిరీస్ లో చేసిన సంగతి చాలా మందికి తెలుసు.ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ హీరోగా చేసిన సూర్య వెబ్ సిరీస్ లో చేసిన సంగతి చాలా మందికి తెలుసు.
ఇదంతా పక్కన పెడితే మౌనిక రెడ్డి ఏడాది కిందట ప్రియుడు సందీప్‌తో పెళ్లి పీటలు ఎక్కింది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది. ఇక పెళ్లయ్యాక కొన్ని రోజులు బాగానే ఉన్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త తెరమీద వినిపిస్తోంది.
దీనికి కారణం మౌనిక తన ఇంస్టాగ్రామ్ లో ఉన్న పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. అంతేకాదు తన భర్త సందీప్‌ని కూడా అన్‌ఫాలో చేసింది. దీంతో ఆమె విడాకులు రూమర్స్ గుప్పుమన్నాయి.
కానీ దీనిపై ఇంతవరక మౌనిక స్పందించకపోవడం గమనార్హం. ఓ వైపు విడాకులపై జోరుగా ప్రచారం జరుగుతుంటే తను మాత్రం తనకేం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంది.
ప్రస్తుతం మౌనిక తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తుంది. అలాగే సినిమాల్లోనూ లీడ్ రోల్ ఆఫర్స్ కూడా కొట్టేస్తుంది. ఈ క్రమంలో తాజాగా మౌనికి సింపుల్ సారీలో లుక్‌లో దర్శనం ఇచ్చింది. చూస్తుంటే ఇవి తన రోల్‌కి సంబంధించి ఫొటోలా కనిపిస్తున్నాయి.
సింపుల్ శారీలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చింది. వీటికి అతుకులు లేని మెరుపు తిరిగి వస్తుంది అంటూ ఆసక్తికరంగా క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం మౌనిక రెడ్డి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.