Mamitha Baiju Photos: 'ప్రేమలు' ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మమిత బైజు - అందరి చూపు ఆమెపైనే
Mamitha Baiju: మమిత బైజు.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుంది. లేటెస్ట్ లవ్ డ్రామా 'ప్రేమలు' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రేమలు చిత్రమే ఆమెకు బ్రేక్ ఇచ్చింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది.
పాజిటివ్ రివ్యూస్, భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించడంతో మమిత పేరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇందులో తన యాక్టింగ్ స్కిల్స్, లుక్‌తో యూత్‌ని ఫిదా చేసింది. దీంతో ప్రస్తుతం కుర్రకారు అంతా మమిత పేరునే కలవరిస్తుంది.
మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఈ సినిమా మార్చి 8న తెలుగులో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు రాజమౌళి తనయుడు శివకార్తీకేయ తెలుగులో సమర్పించారు.
ఇక ఈ సినిమా తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుని విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిన్న ప్రేమలు సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.
ఈ ఈవెంట్లో మమితా బైజు ట్రేడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది.. చీరలో ఈ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఈవెంట్లో అందరి చూపు ఆమెపై. ప్రస్తుతం మమిత బైజు ఫోటోలు వైరల్‌గా మారాయి.