ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని గతంలో ఆయనకు మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లుతోపాటు ప్రభుత్వం తరఫున ఐదున్నర లక్షల రూపాయలు మంజూరు చేయించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమిగిలిన ఇంటి నిర్మాణానికి సంబంధించి తన కార్యాలయం ద్వారా పర్యవేక్షణ చేయించి పూర్తి చేయించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులను పర్యవేక్షించారు.
మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా వచ్చారు.
అంశాల స్వామితోపాటు ఆయన తల్లిదండ్రుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి ఇంట్లోనే భోజనం చేశారు.
ఇంటి నిర్మాణం, ఆయన హెయిర్ కటింగ్ సెలూన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ అంశాల స్వామి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.