ABP Cvoter Exit Poll Results 2023: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ 2023 లో ఏం తేలింది!
తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో .. కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కానీ.. అదే సమయంలో హంగ్ అసెంబ్లీ అంచనాలను కూడా తోసిపుచ్చలేమని ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తేలింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితికి 38 నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమికి మూడు నుంచి 13 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇతరులు 5 నుంచి 9 స్తానాల్లో గెలుస్తారు. ఇతరుల్లో మజ్లిస్ పార్టీ కూడా ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇప్పటికే ABP CVoter Opinion Poll ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలపై కొన్ని అంచనాలు విడుదల చేసింది. ఇప్పుడు ABP CVoter Exit Poll ఫలితాలూ విడుదలయ్యాయి. ఈ అంచనాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి 41-53 సీట్లు వచ్చే అవకాశముంది. బీజేపీ 36-48 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇతరులు 0-4 వరకూ గెలుచుకుంటారని వెల్లడించింది. గతేడాది కాంగ్రెస్ 68 స్థానాలు సాధించింది. ప్రస్తుత అంచనాల మేరకు 47 సీట్లకే పరిమితం కానుంది. ఇక బీజేపీ మాత్రం బాగానే పుంజుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ఎన్నికలపై ABP CVoter Exit Poll అంచనాలు వెల్లడించింది. కాంగ్రెస్‌కి ఈ సారి 71-91 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 94-114 సీట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది. అంటే గరిష్ఠంగా బీజేపీకి 114 సీట్లు వస్తాయి. ఈ రకంగా చూస్తే...బీజేపీకే ఎక్కువగా విజయావకాశాలున్నాయి.
ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం... ఈ ఎన్నికల్లో MNF 15-21 స్థానాల్లో గెలుచుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌కి 2-8 సీట్లు, ZPM 12-18 సీట్లలో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్‌కి 113-137 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీ 88-112 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది.