Crime News: మోస్ట్ వాంటెడ్ దొంగను పట్టుకున్న అనంతపురం పోలీసులు- రూ. 12 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం
ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో నేరాలు చేసిన మోస్ట్ వాంటెడ్ నిందితుడు పార్థి గ్యాంగ్ సభ్యుడు డోల్ సింగ్ కాలేను అరెస్టు చేసిన అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పలు దొంగతనాలకు ఒడిగట్టిన సత్తెనపల్లి అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు అరెస్టు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడోల్ సింగ్ కాలే నుంచి రూ 12 లక్షలు విలువైన 218 గ్రాముల బంగారు, 2 కేజీల 600 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు
ఈనెల 3 న అనంతపురంలో డోల్ సింగ్ కాలే పాల్పడిన హౌస్ బ్రేకింగ్ కేసులో మొత్తం సొత్తులు రికవరీ చేసిన నాల్గవ పట్టణ పోలీసులు
డోల్ సింగ్ కాలే పై మహారాష్ట్రలో 4 దొంగతనం కేసులు, తెలంగాణ రాష్ట్రంలో 17 దొంగతనం కేసులు, ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు ఉన్నట్లు CCTNS ద్వారా తెలుస్తోంది.
కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పలు దొంగతనాలకు ఒడిగట్టిన సత్తెనపల్లి అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు అరెస్టు
సత్తెనపల్లి ముఠాకు చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బిగబండ గ్రామానికి చెందిన 1) కుంచాలా నాగరాజు, 2) డేరంగుల అంకమ రావు అరెస్టు
ప్రజలు పోగొట్టుకున్న / చోరీలకు గురైన ఫోన్లలో 20 రోజుల కిందట 135 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసిన జిల్లా పోలీస్ మరోసారి 125 సెల్ ఫోన్లు రికవరీ చేశారు