ICE Cream Adulteration : ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? కూల్ గా విషం తింటున్నట్లే- హైదరాబాద్ లో మరో కల్తీ ముఠా గుట్టురట్టు
ఎండకాలం రాగానే ఐస్ క్రీమ్ లో డిమాండ్ పెరుగుతుంది. వీధుల్లో సైకిళ్లపై ఐస్ క్రీమ్స్ అమ్ముతుంటారు. వీటిని కొనుగోలు చేసేందుకు పిల్లలు ఆసక్తి చూపుతారు. అయితే ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న కొందరు కల్తీ ఐస్ క్రీమ్ లను తయారుచేస్తున్నారు. కెమికల్స్, కృత్రిమ రంగులతో ఐస్ క్రీమ్స్ తయారుచేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దూలపల్లిలో డైరీ కూల్ ఐస్ క్రీమ్స్ పేరుతో కల్తీ ఐస్ క్రీమ్ ఉత్పత్తులు తయారీ చేస్తున్నారు. ఈ గోదాంపై మేడ్చల్ జోన్ ఎస్వోటీ పోలీసుల దాడులు చేశారు. ఈ దాడిలో గొల్ల అంకయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 8 లక్షల 20 వేల విలువైన కల్తీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు.
కూకట్పల్లి, పేట్ బషీర్ బాద్ పీఎస్ పరిధిలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలను ఎస్వోటీ అధికారులు గుర్తించారు. ఐస్ క్రీమ్‌ల తయారీలో కల్తీ రంగులు ఉపయోగిస్తున్నారు. కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై ఎస్వోటి పోలీసులు దాడులు చేస్తున్నారు.
పిల్లల అనారోగ్యానికి కారణం అవుతున్న కల్తీ ఐస్ క్రీమ్ లు మార్కెట్ లో ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలో భారీగా కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలు సిద్ధమయ్యాయి. నిన్న చందనగర్ లో 10 లక్షలు విలువ చేసే కల్తీ ఐస్ క్రీములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దూలపల్లిలో డైరీ కూల్ పేరుతో కల్తీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న గో డౌన్స్పై మేడ్చల్ ఎస్ఓటీ పోలీసుల దాడి చేశారు. కెమికల్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతూ ఉత్పత్తులు తయారు చేస్తున్న అంకయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఉన్న 8 లక్షల విలువైన ఐస్ క్రీమ్ ప్రాడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలు, కల్తీ రంగులతో ఐస్ క్రీమ్ లను తయారుచేస్తున్నారు. సైబరాబాద్ లో రెండు రోజుల వ్యవధిలో 28 లక్షల విలువచేసే కల్తీ ఐస్ క్రీములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ ఐస్ క్రీమ్‌లకు బ్రాండెడ్ స్టిక్కర్లు అతికించి మార్కెట్ లో అమ్ముతున్నారు. చందానగర్ కూకట్పల్లి, పేట్ బషీరాబాద్, దూలపల్లి ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు.
మేడ్చల్‌లో డైరీ కూల్ ఐస్ క్రీమ్స్ పేరుతో కల్తీ ఉత్పత్తుల తయారీ గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీధుల్లో సైకిళ్లపై వచ్చే ఐస్ క్రీమ్ లు కొనుగోలు చేసినప్పుడు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.