Wealth Loss: కోటి కోట్ల నష్టం! రూ. 10,92,12,32,00,00,000 కోట్ల సంపద గాయబ్!
ఈ ఏడాది ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు పెరగడం, ఆర్థక వ్యవస్థలు మందగమనంలో ఉండటంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. దాంతో ప్రపంచంలోని కుబేరుల సంపద ఈ ఏడాది 1.4 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. అందులో కేవలం ఐదుగురే 345 బిలియన్ డాలర్లు నష్టపోయారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబైనాన్స్ కంపెనీ సీఈవో చాంగ్‌పెంగ్ జావో 2022లో 85.6 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. ఇప్పుడాయన నెట్‌వర్త్ 10.2 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 56.8 బిలియన్ డాలర్ల సంపద నష్టపోయారు. ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ 121.2 బిలియన్ డాలర్లు.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏకంగా 73.2 బిలియన్ డాలర్ల సంపద నష్టపోయారు. ఇప్పుడాయన నెట్‌వర్త్ 197.1 బిలియన్ డాలర్లు.
అమెజాన్ సృష్టికర్త జెఫ్ బెజోస్ ఈ ఏడాది 65.3 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. ఇప్పుడాయన నెట్‌వర్త్ 127 బిలియ్ డాలర్లు.
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఈ ఏడాది 64.4 బిలియన్ డాలర్ల సంపద నష్టపోయారు. ఇప్పుడాయన నెట్‌వర్త్ 61.1 బిలియన్ డాలర్లు.