SBI Fake SMS: బీ అలర్ట్.. మీ యోనో అకౌంట్ బ్లాకైంది - ఎస్బీఐ నకిలీ సందేశాల స్కామ్!
భారతీయ స్టేట్ బ్యాంకు (SBI) వినియోగదారులకు హెచ్చరిక! ఎస్బీఐ అధికారుల పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని పీఐబీ తెలిపింది. మీ యోనో ఖాతా (YONO Account) బ్లాక్ అయిందంటూ సందేశాలు పంపిస్తున్నారని వెల్లడించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'డియర్ ఎస్బీఐ యూజర్! మీ యోనో అకౌంట్ ఈరోజు బ్లాక్ అయింది. మీ పాన్‌కార్డు నంబర్ అప్డేట్ చేసుకొనేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి' అని సందేశాలు వస్తున్నాయని పీఐబీ తెలిపింది.
మీ బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలు పంచుకోవాలంటూ వచ్చిన ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లకు స్పందించొద్దని పీఐబీ వెల్లడించింది. ఒకవేళ ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే report.phishing@sbi.co.inకు రిపోర్టు చేయాలని సూచించింది.
మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా నంబర్లు, పాస్వర్డులు, ఇతర సున్నితమైన సమాచారాన్ని టెక్ట్స్ సందేశాల రూపంలో పంచుకోవద్దని ఎస్బీఐ పేర్కొంది. ఇవి మోసాలకు దారితీస్తాయని హెచ్చరించింది.
'సత్వరమే మీ వ్యక్తిగత సమాచారం, అకౌంట్ యాక్టివేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలంటూ సందేశాల వస్తే అప్రమత్తంగా ఉండాలి. కొందరు మోసగాళ్లు ఇలాంటి స్కామ్‌లు చేస్తున్నారు. ఒకవేళ సైబర్ నేరాలు చోటు చేసుకుంటే report.phishing@sbi.co.in, https://cybercrime.gov.in/కు లాగిన్ అవ్వండి. లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయండి.