Rupee vs Dollar: డాలర్‌తో రూపాయికి దడే! ఆల్‌టైమ్ కనిష్ఠం 80.67కు పతనం!
రూపాయి విలువ గురువారం ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు లో అయిన 80.285 వద్ద ఓపెనైంది. బుధవారం నాటి ముగింపు 79.97తో పోలిస్తే 0.39 శాతం పడిపోయింది. ఆ తర్వాత నష్టాలు మరింత కొనసాగి 80.627కు పతనమైంది. అంతకు ముందు కనిష్ఠ స్థాయి 80.12 ఆగస్టులో నమోదైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరోవైపు అమెరికా డాలర్ ఇండెక్స్ 20 ఏళ్ల సరికొత్త గరిష్ఠ స్థాయి 111.72కు చేరుకుంది. రెండేళ్ల అమెరికా ట్రెజరీ యీల్డు సైతం 4 శాతానికి పైగా పెరిగింది. ఇది ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
'తాత్కాలికంగా భారత రూపాయి 81 లేదా 81.50కు పతనమయ్యే అవకాశం ఉంది. మార్చి 31కి ముందు 80కి దిగువకు వెళ్తుందని అనుకోలేదు. రూపాయి బలహీనతపై వైపు మూమెంటమ్ కనిపిస్తోంది. కానీ ఎక్కువ కాలం ఇదే జోన్‌లో ఉండలేం' అని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎండీ, కంట్రీ ట్రెజరర్ జయేశ్ మెహతా అంటున్నారు.
యూఎస్ ఫెడ్ బుధవారం రాత్రి వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దాంతో డాలర్ ఇండెక్స్ మరింత బలపడింది. రూపాయి బలహీనపడింది. పతనాన్ని అడ్డుకొనేందుకు ఆర్బీఐ ఇప్పటికే డాలర్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
ఫెడ్ వడ్డీరేట్ల పెంపుతో అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. గురువారం ఆసియా మార్కెట్లు, కరెన్సీలు పతనమయ్యాయి. ఈ ఏడాది ఫెడ్ వడ్డీరేట్లను ఇప్పటికే 4.25 శాతానికి తీసుకెళ్లింది. నవంబర్లో మోసారి 75 బేసిస్ పాయింట్లు పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి.
అమెరికా జీడీపీ 2023లో 1.2 శాతం, 2024లో 1.7 శాతం వృద్ధిరేటుతో పయనిస్తుందన్న అంచనాలతో డాలర్ విలువ మరింత పెరుగుతోంది. కానీ ప్రజలను ఫెడ్ మాంద్యం పరిస్థితులకు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 2023లో నిరుద్యోగిత 4.4శాతానికి చేరనుంది.