Income Tax: ఈజీ.. సింపుల్! ఇకపై ఫోన్ పేలోనూ టాక్స్ చెల్లించొచ్చు!
తమ యాప్‌లో ఇన్‌కం టాక్స్ పేమెంట్ ఫీచర్‌ను తీసుకొచ్చామని ఫోన్ పే ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు సెల్ఫ్ అసెస్మెంట్తో పాటు నేరుగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించొచ్చని తెలిపింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకస్టమర్లు యూపీఐ లేదా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఇందుకోసం B2B చెల్లింపులు, సేవలు అందించే పేమేట్ (PayMate)తో ఫోన్‌పే భాగస్వామ్యం కుదుర్చుకుంది.
'పన్నులు చెల్లించే ప్రక్రియ కొన్ని సార్లు సంక్లిష్టంగా ఉంటుంది. మరికొన్ని సార్లు చాలా సమయం తీసుకుంటుంది. అందుకే ఇలాంటి ఇబ్బందుల్లేని ఫీచర్‌ను ఫోన్ పే తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు చాలా సులభంగా పన్నులు చెల్లించొచ్చు' అని ఫోన్ పే వెల్లడించింది.
'మేం తీసుకొచ్చిన ఈ సదుపాయం పన్నుల చెల్లింపు ప్రక్రియలో పరివర్తన తీసుకొస్తుందని మా నమ్మకం. మా యాప్‌తో సులభంగా, సౌకర్యంగా పన్నులు చెల్లించొచ్చు' అని ఫోన్‌పే బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారికా సింఘాలు అన్నారు.
బ్యాంకును బట్టి మీరు చెల్లించిన అడ్వాన్స్ టాక్స్‌కు 45 రోజులు వడ్డీ రహిత సమయం ఉంటుందని, రివార్డు పాయింట్లు గెలుచుకోవచ్చని ఫోన్ పే ప్రకటించింది. డబ్బులు చెల్లించాక ఒక యునిక్ ట్రాన్జాక్షన్ రిఫరెన్స్ (UTR) నంబర్ వస్తుందని తెలిపింది. రెండు రోజుల్లో చలాన్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.