ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ రికార్డు! 10 రోజులు ముందుగానే 2 కోట్ల మార్క్ క్రాస్!
ఆదాయపన్ను శాఖ (Income Tax) మస్తు ఖుషీగా ఉంది. 2023, జులై 11 వరకు రెండు కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారని ప్రకటించింది. గతేడాది ఈ మైలురాయిని చేరుకోవడానికి జులై 20 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగతేడాదితో పోలిస్తే తొమ్మిది రోజులు ముందుగానే ఐటీఆర్ ఫైల్ (ITR Filing) చేసిన వారి సంఖ్య రెండు కోట్లు దాటిందని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇందుకు పన్ను చెల్లింపు దారులను ప్రశంసిస్తున్నామని పేర్కొంది.
అసెస్మెంట్ ఇయర్ 2023-24కు సంబంధించిన ఐటీఆర్‌ను వేగంగా దాఖలు చేయాలని ఐటీ శాఖ కోరుతోంది. ఆఖరి వరకు ఎదురు చూడొద్దని తెలిపింది. అలా చేయడం వల్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని సూచిస్తోంది.
ఈ సారి 2023, జూన్ 26కే కోటి మంది ఆదాయపన్ను రిటర్నులు (Income Tax Return) దాఖలు చేయడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే 12 రోజులు ముందుగానే రికార్డు సాధ్యమైంది. అంతకు ముందు జులై 8 వరకు ఆగాల్సి వచ్చిందని వెల్లడించింది.
ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేయడం ఇప్పుడు సులువుగా మారిపోయింది. వెబ్‌పోర్టల్‌లో (https://www.incometax.gov.in/iec/foportal/) ఎన్నో మార్పులు చేపట్టింది. పోర్టల్ ఓపెన్ చేసిన మీ ఆదాయం, ఆదాయ వనరును బట్టి ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్ 2 ఎంచుకొని చకచకా ఫైలింగ్ చేయొచ్చు.